1989 నుండి, ఆంధ్ర పేపర్ లిమిటెడ్, నారగలముడి సామగ్రియొక్క వనరులను సమీకరించుకొను విషయంలో స్వయంసమృద్ధి యొక్క ఆవశ్యకతను గుర్తించింది. అంతిమంగా కలపగుజ్జును అందించే పంటయొక్క స్వభావమునుబట్టి, అటవీ పెంపకం యొక్క ముఖ్యమైన చొరవనుతీసుకొని, చూసుకోకపోయి ఉంటే అటవీవి నాశనానికి దారితీసియుండేది. తత్ఫలితంగా ఆంధ్ర పేపర్ లిమిటెడ్, రైతులతో సమన్వయముచేసుకొంటూ, వారి బీడుభూములు, వదిలే సినభూములు మరియు భూసారము క్షీణించిన భూములను ఉపయోగించుకొని, ముడి సామగ్రిని ఉత్పన్నంచేయుటకై ఒక ఆశాజనకమైన ప్రణాళికను ప్రారంభించుటకు సిద్ధమైంది.
ఈ మార్గదర్శకదశ వ్యవసాయ అటవీ తోటల కార్యకలాపాల ప్రారంభానికి గుర్తుగా ఉంది మరియు ఇది సంస్థచరిత్రలో ఒక మలుపు. 1989 లో ప్రారంభమైన ఈ సాంఘిక అటవీ ప్రయత్నం విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం మరియు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలకు వ్యాపించింది. అప్పటినుండి, ఈ కార్యక్రమంచిన్న రైతులకుమనుగడ సాధించే మార్గాలను అందిస్తోంది మరియు వారి వర్గాల సామాజిక-ఆర్ధిక స్థితిలో మెరుగుదల పైదృష్టిసారించింది. ప్రతిగా,ఆంధ్ర పేపర్ లిమిటెడ్ పదార్థాల సోర్సింగ్‌లో మొత్తం స్వయం సమృద్ధిని సాధించింది. తోటల ఉత్పాదకత మరియు రైతులకు ఆదాయ ఉత్పత్తిని పెంచడానికి ఇదిసరుగుడు యొక్క అధికదిగుబడి, జన్యు పరంగా ఉన్నతమైన క్లోన్లనురంగంలోకి తెచ్చింది.